Nadendla Manohar Political Jouney with Janasena, My Openion

నాదెండ్ల మనోహర్…!
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా..రెండు పర్యాయాలు శాసనసభ సభ్యుడిగా.. మొత్తం 2018 నాటికి దాదాపు రెండు దశాబ్దాల నుండి రాజకీయాల్లో ఉన్నా సౌమ్యుడిగా అసలు ఎటువంటి గొడవలకు వెళ్లకుండా నేటి తరంలో అతి తక్కువ మందికి తెలిసిన నాయకుడు. కానీ 2018లో జనసేన పార్టీలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరిన్నప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు నేటి యువత నోటిలో మారు మోగిపోతుంది.

అయితే ఆయనకు జనసేన అధ్యక్షుడు దాదాపు పార్టీలో రెండవ స్థానం కలిపించడం..దేవుడు ఇచ్చిన అన్నయ్య అని వ్యాఖ్యానించడంతో జనసైనికులు ఆయన గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.సరిగ్గా అక్కడే నాదెండ్ల మనోహర్ గారి పై జనసేన కార్యకర్తల్లో అనేక అనుమానాలు వచ్చాయి. ఆయన పార్టీలోని ముఖ్య నాయకులకు గౌరవం ఇవ్వడం లేదు అని..కార్యకర్తలను దగ్గరకు రానివ్వరు అని..ఆయన చంద్రబాబునాయుడికి నేరుగా పని చేస్తున్నారని.. పవన్ గారిని మళ్ళీ టీడీపీ వైపు నడిపించే పనిలో ఉన్నారని..ఇలా అనేక ప్రశ్నలు ఆ నోటా,ఈ నోటా మారుతూ హైదరాబాద్ లో ఉన్న నా దాక వచ్చింది.కానీ
అప్పటికే పార్టీలో చేరిన తొలిరోజుల్లో నేను ఆయనను ఒక్కసారి హైదరాబాద్ లోని తన నివాసంలో కలిశాను.తొలి పరిచయంలో నాకు ఆయన పై చాలా మంచి అభిప్రాయం కుదిరింది. కొంత మంది కార్యకర్తలు నాకు ఇలా చెప్పడంతో పార్టీలో చేరిన తర్వాత ఆయన శైలి మారింది అనుకున్నాను.

అంతలో సంక్రాంతి పండగకు మనోహర్ గారి ఆదిత్యం స్వీకరించడానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెనాలి వస్తున్నారని ప్రకటన విడుదలైంది.ఆనాడు మీడియాలో ఉన్న నేను కవరేజ్ కి అక్కడకు చేరుకున్నాను. పార్టీలోని కొంత మంది ముఖ్య నాయకులతో నేను మాట్లాడుతూ ఉండగా అక్కడ మనోహర్ గారు ఏదో రాసుకుంటూ కనిపించారు.మధ్యలో మా మాటలకు ఆయన నవ్వుతూ మా వైపు చూశారు.. ఒక వ్యక్తి నన్ను పరిచయం చేయగా నేను మనం ముందు ఒక్కసారి కలిశాము అంటూ నేను గతంలో కలిసిన విషయాన్ని గుర్తు చేశాను. ఆయన కూడా గుర్తు పట్టారు.ఆయనలో నాకు ఎలాంటి మార్పు కనపడలేదు. దీంతో అసలు కార్యకర్తలకు ఆయనకు ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డాను.

ఆయన పై అనేకులు అనే మాట ఆయన టీడీపీ కోవర్టు అని..చంద్రబాబు మనిషి అని.. కానీ ఇక్కడ నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి జనసేనలోకి వచ్చారు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు టీడీపీలో లేరు. ఆయన తండ్రి టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి స్థానం అధిరోహిస్తే నాడు ప్రతిఘటించిన ఎన్టీఆర్ వెంట నిలిచి, ఆయనను నాడు పదవిచిత్తుడిని చేసింది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారే అని గుర్తు చేస్తున్నాను.మరి ఆయనతో ఈయన ఎలా కలిసి ఉన్నారో అర్థం కాలేదు.రెండవది నాయకులకు గుర్తింపు..కళ్యాణ్ గారి తర్వాత నేనే అనుకొని అనేక మంది నాయకులు కలలు కన్నారు. రాజకీయల్లో అది సహజం..కానీ మనోహర్ గారికి కళ్యాణ్ గారు ఆ స్థానం కలిపించడంతో కొంత మంది నాయకులకు మింగుడు పడలేదు.అది పార్టీ నాయకులు అంతర్గతంగా చూసుకోవాల్సిన విషయం.

అధ్యక్షుడే స్వయంగా ఆయనకు ఆ మర్యాద ఇచ్చినప్పుడు కార్యకర్తలు కళ్యాణ్ గారి మీద గౌరవంతో మనోహర్ గారి మాటలు కదా వినాలి.!?చివరిది కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. అవును ఎన్నికలకు కొన్ని నెలల ముందే పార్టీలోకి వచ్చిన మనోహర గారికి తొలుత పార్టీలో ఇమడడానికి సమయం పట్టింది..అంతలోనే ముంచుకొచ్చిన ఎన్నికలు..దీంతో ఎన్నికల ముందు ఆయన కార్యకర్తలకు కొంచం దూరంగా ఉండి ఉండవచ్చు.. ఎన్నికల అనంతరం ఆయన తన వద్దకు వచ్చిన అనేకమంది కార్యకర్తలతో అనేక సార్లు కలవడం నేను స్వయంగా చూశాను.

పార్టీ అధ్యక్షుడు ఒక్కసారి ఆఫ్ కెమెరాలో నేను ఉన్న చోట “ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను. ముందుకు వచ్చి ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు..మనోహర్ గారు మాత్రమే కొన్ని పనులు తీసుకున్నారు”అని ఎన్నికల ముందు వ్యాఖ్యానించారు.దీంతో ఆయన పార్టీ కోసం పని చేస్తున్నట్లే కదా.ఇంకొంత మంది ఆయన రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్ వారికి పదవులు ఇప్పిస్తున్నారని అంటారు.. అదే నిజం అయితే తన వల్ల జనసేనలోకి కొత్త వారు వచ్చారు అనే కదా అర్థం.అది పార్టీకి లాభమే కదా..!పార్టీ మనది అనుకోవాలి కానీ నాది మాత్రమే అనుకోకూడదు అని గుర్తు చేస్తున్నాను…!!

తన తండ్రి బీజేపీలో చేరితే ఆయన పై మాట్లాడుతున్నారు. ఆ మాటకు వస్తే మనలో చాలామంది ఇంట్లో వారు వేరే పార్టీలో లేరా!ఒక్క జాతీయ పార్టీలో పని చేసిన వ్యక్తి..ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భావంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి..ఒక కొడుకు మాట వింటారా??

ఇప్పటికైనా నిజమైన జనసైనికులు అపోహలు,అనుమానాలు పక్కన పెట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అనేక బాధ్యతలు అప్పగించిన నాదెండ్ల మనోహర్ గారిని నేరుగా వెళ్లి కలిసి మీ సమస్యలు వివరించండి.ఇక కొంత మంది నాయకులు ఆయన ఆ వర్గానికి మద్దతు ఇస్తున్నారు అని చెప్తున్నారు.మీరు నేరుగా వెళ్లి ఆయనను కలిసి జరిగిన విషయాలు ఆయనకు వివరించండి.పార్టీకి నిజంగా మీరు చెబుతున్న వారి వల్ల నష్టం ఉంటే ఆయన తప్పక స్పందిస్తారు కారణం అలా నష్టపరించిన వాళ్ళని పక్కన పెట్టుకొని జీవిత కాలం ఓటమిలో ఉండిపోవాలి అని ఎవరు అనుకోరు కదా…!

ఎందుకో సామాజిక మాద్యమలలో కొందరి పోస్టులు చూశాక చాలా కాలం తర్వాత ఇలా పెద్ద పోస్టు పెట్టాలి అనిపించింది.

ఇది నేను ఆయనను చూసిన సందర్భాలను బట్టి నాకు ఆయన అర్థమైన విధానం.ఇది పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే.

One thought on “Nadendla Manohar Political Jouney with Janasena, My Openion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *